మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 16:00:28

క‌ర్ర‌ల‌తో కొట్టి, గొడ్డ‌లితో న‌రికి.. డాల్ఫిన్‌ను చంపేసిన ఆక‌తాయిలు.. వీడియో

క‌ర్ర‌ల‌తో కొట్టి, గొడ్డ‌లితో న‌రికి.. డాల్ఫిన్‌ను చంపేసిన ఆక‌తాయిలు.. వీడియో

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్ర‌తాప్‌గ‌ఢ్ జిల్లాలో దారుణం జ‌రిగింది. గంగాన‌దిలో ఆడుతూ క‌నిపించిన ఓ డాల్ఫిన్‌ను కొంద‌రు ఆక‌తాయిలు అతికిరాతకంగా కొట్టిచంపారు. ఐదారుగురు ఆకాతాయి యువ‌కులు న‌ది ఒడ్డును ఆడుతున్న డాల్ఫిన్‌ను చుట్టుముట్టి క‌ర్ర‌ల‌తో దెబ్బ‌ల వ‌ర్షం కురిపించారు. ఒక‌డు గొడ్డ‌లితో న‌రికాడు. ఆ మూగ‌జీవి దేహం నుంచి ర‌క్తం దార‌లుగా కారుతున్న వాళ్లు విడిచిపెట్ట‌లేదు. ఈ దారుణం జ‌రుగుతుండ‌గా ప‌దుల సంఖ్య‌లో జ‌నం గుమిగూడి చూశారే త‌ప్ప ఎవ‌రూ ఘోరాన్ని ఆపే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని డాల్ఫిన్ క‌ళేబ‌రాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితుల‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా వారిని కూడా గుర్తించే ప‌నిలో ఉన్నారు. గ‌త డిసెంబ‌ర్ 31న ఈ దారుణం జ‌రిగింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.