గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 11, 2020 , 16:19:15

ప్రముఖ ఆలయంలో ముగ్గురు పూజారుల హత్య

ప్రముఖ ఆలయంలో ముగ్గురు పూజారుల హత్య

బెంగళూరు: కర్ణటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని ప్రసిద్ధ అరకేశ్వర ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులను దొంగలు హత్య చేశారు. గురువారం రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న మాండ్య గణేష్, ప్రకాష్, ఆనంద్ అనే పూజారులను బండరాళ్లతో కొట్టి చంపారు. అనంతరంలో ఆలయంలోని హుండీలో డబ్బులను చోరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దేవుడి నగలు చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు తాళల కోసం పూజారులను చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు సీఎం బీఎస్ యెడియూరప్ప ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పూజారులను చంపడం అమానుషమని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo