సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 15:04:36

ప‌ట్టు చీర‌ల‌ను దొంగిలించిన ఐదుగురు అరెస్టు

ప‌ట్టు చీర‌ల‌ను దొంగిలించిన ఐదుగురు అరెస్టు

చెన్నై : సిల్క్ చీర‌ల‌ను దొంగిలించిన ఐదుగురు వ్య‌క్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... కోలాథూర్‌కు చెందిన పి. ప్ర‌భు అనే వ్య‌క్తి ప‌ట్టు చీర‌ల వ్యాపారం చేస్తుంటాడు. పాత ల‌క్ష్మీపురంలోని ఓ గోదాంలో చీర‌ల‌ను స్టాక్ చేశాడు. ఈ నెల 17న గోదాంకు లాక్ చేసి ఇంటికి వెళ్లాడు. మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌చ్చి చూసే స‌రికి షాక్‌కు గుర‌య్యాడు. గోదాంలోని ప‌ట్టు చీర‌ల‌న్ని చోరీకి గుర‌య్యాయి. అప‌హ‌ర‌ణ‌కు గురైన చీర‌ల విలువ దాదాపు రూ. 15 ల‌క్ష‌లకు పైగానే. బాధితుడి ఫిర్యాదు మేర‌కు పూజ‌ల్‌ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీ ప‌రిశీల‌న అనంత‌రం ఓ అనుమానితుడిని గుర్తించారు. నిందితుడిని అదే గోదాంలో ప‌నిచేసే పి. విగ్నేశ్‌గా గుర్తించారు. తన స‌హ‌చ‌రుల‌తో క‌లిసి చోరీకి పాల్ప‌డ్డాడు. నిందితుల వ‌ద్ద నుంచి 321 ప‌ట్టు చీర‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


logo