మంగళవారం 24 నవంబర్ 2020
Crime - Oct 24, 2020 , 11:57:33

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ : సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా ఓఎల్‌ఎక్స్‌లో వరుస మోసాలకు గురి చేస్తున్న 18 మందిని పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచారు. సైబర్‌ క్రైమ్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి మాట్లాడుతూ ఓఎల్‌ఎక్స్‌లో మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన 18మందితో కూడిన ముఠాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ముఠా గతంలో బంగారం దొంగతనాలకు పాల్పడేదని తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీని వాడుకుంటూ ఓఎల్‌ఎక్స్‌లో సైబర్‌ నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. ఇటీవల ఓఎల్‌ఎక్స్‌లో మోసాలు భారీగా పెరగడంతో రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా పోలీసుల సహాయంతో నిందితుల స్వగ్రామాలకు వెళ్లి పది మందిని అరెస్టు చేశామని, అప్పటికే అక్కడి పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మందిని ఇక్కడికి తరలించినట్లు పేర్కొన్నారు. ముఠాపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని చెప్పారు. ఇకపై సైబర్‌ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక నిఘా పెడుతామని చెప్పారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.