శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 10, 2020 , 16:49:13

చీర‌లో యువ‌కుడి డ్యాన్స్.. చంపేసిన స్నేహితులు

చీర‌లో యువ‌కుడి డ్యాన్స్.. చంపేసిన స్నేహితులు

ముంబై : ఓ యువ‌కుడు చీర ధ‌రించి డ్యాన్స్ చేశాడు. యువ‌కుడి డ్యాన్స్ ను మ‌రో న‌లుగురు యువ‌కులు త‌మ మొబైల్స్ లో చిత్రీక‌రించారు. ఆ వీడియోను డిలీట్ చేయ‌మ‌ని అడిగినందుకు యువ‌కుడిని క‌త్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ముంబైలోని ధార‌వి స్ల‌మ్ ఏరియాలో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ధార‌విలోని సుభాష్ న‌గ‌ర్ కు చెందిన కౌశిక్ సునీల్ నారాయ‌ణ్ క‌ర్(17) అనే యువ‌కుడు.. త‌న ఇంట్లో చీర ధ‌రించి డ్యాన్స్ చేశాడు. యువ‌కుడి డ్యాన్స్ ను అదే కాల‌నీకి చెందిన మ‌రో న‌లుగురు యువ‌కులు ఫోన్ల‌లో చిత్రీక‌రించారు. ఈ విష‌యం కౌశిక్ కు తెలిసింది. అయితే త‌న డ్యాన్స్ వీడియో డిలీట్ చేయ‌మ‌ని అడిగాడు. లేక‌పోతే పోలీసులకు లేదా త‌న అంకుల్ కు చెప్తాన‌ని హెచ్చ‌రించాడు. 

స్థానిక నాయ‌కుడైన అంకుల్ వ‌ద్దకు కౌశిక్ వెళ్లాడు. అక్క‌డ అత‌ను లేక‌పోవ‌డంతో ఇంటికి తిరిగొస్తున్న క్ర‌మంలో మార్గ‌మ‌ధ్య‌లో మాటు వేసిన న‌లుగురు యువ‌కులు క‌త్తితో కౌశిక్ పై పొడిచారు. దీంతో తీవ్ర గాయాల‌పాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ కౌశిక్ క‌న్నుమూశాడు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కౌశిక్ హ‌త్య‌కు కార‌ణ‌మైన న‌లుగురు యువ‌కుల‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ న‌లుగురిలో ముగ్గురు మైన‌ర్లు ఉన్నారు.  మైన‌ర్ల‌ను డొంగ్రి రిమాండ్ హోమ్ కు త‌ర‌లించారు. 


logo