గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 21:41:00

రిషికేశ్ లో నగ్న వీడియో తీసుకున్న విదేశీయురాలు అరెస్ట్

రిషికేశ్ లో నగ్న వీడియో తీసుకున్న విదేశీయురాలు అరెస్ట్

డెహ్రాడూన్ : రిషికేశ్ లోని గంగ నదిపై ఉన్న ప్రసిద్ధ లక్ష్మంజుల వంతెనపై తన నగ్న వీడియో తీసుకున్న ఓ ఫ్రెంచ్ మహిళను ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్ గజేంద్ర సజ్వాన్ ఆగస్టు 25 న సదరు మహిళపై ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రాన్స్ కు చెందిన ఓ 27 ఏండ్ల మహిళ పర్యటన నిమిత్తం వారం రోజుల క్రితం రుషికేశ్ కు వచ్చింది. అయితే, ప్రసిద్ధ లక్ష్మంజుల వంతెనపై తిరుగుతూ నగ్నంగా తన వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు తెలియగానే స్థానిక కౌన్సిలర్ గజేంద్ర సజ్వాన్ మునికిరెటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెపై ఐటీ చట్టం యొక్క వివిధ విభాగాల కింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళ రిషికేశ్ లోని ఓ హోటల్ లో నివసిస్తున్నట్లు తెలుసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ ఆర్ కే సైని చెప్పారు. 

ఆ వీడియోను తానే చిత్రీకరించానని అంగీకరించిన సదరు ఫ్రెంచి మహిళ.. ఇలా చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధమని తనకు తెలియని పేర్కొన్నారు. అనంతరం ఆమెను బెయిల్ పై విడుదల చేశారు. కాగా, సదరు మహిళ గత నాలుగైదు నెలలుగా రిషికేశ్ లోనే ఉంటున్నట్లు హోటల్ సిబ్బంది ద్వారా తెలిసింది.


logo