కేవైసీ అప్డేట్ పేరుతో మోసం.. ముఠా సభ్యుల అరెస్టు

హైదరాబాద్ : పేటీఎం కేవైసీ అప్డేట్ పేరిట ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మంగళవారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వినయ్‌శర్మ అనే బాధితుడిని నుంచి రూ.4.29 లక్షలు కొట్టేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జార్కండ్ కేంద్రంగా ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఏడుగురిని అరెస్టు చేసి వీరి నుంచి రూ.1.47 లక్షల నగదు, మొబైల్ ఫొన్లు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) సజ్జనార్ తెలిపారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకుఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, ఆధార్ నెంబర్ తదితర వివరాలు ఇవ్వవద్దని కోరారు. ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసుశాఖ కృషి చేస్తున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’