సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 13:59:12

నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

నదిలో నలుగురు బాలురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

సింగ్రౌలి : మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో నదిలో ఈతకు వెళ్లి నలుగురు బాలురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కుదర్ లమ్‌సర గ్రామానికి చెందిన నలుగురు బాలురు శివారులోని సోన్ నదిలో ఈతకు వెళ్లారు. సరదాగా ఈదుతూ లోతుకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతిలో నీట మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఆనంద్ కుమార్ (13) మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ సరిహద్దు గ్రామంలోని నది ఒడ్డున గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన అమిత్ కుమార్, రోహిత్ కుమార్, రాహుల్ బైస్‌ల కోసం గాలింపు చర్యలు నసాగుతున్నాయని గర్హ్వా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్ తివారీ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo