ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 27, 2020 , 12:53:01

గాంధీ నుంచి పారిపోయిన న‌లుగురు క‌రోనా ఖైదీలు

గాంధీ నుంచి పారిపోయిన న‌లుగురు క‌రోనా ఖైదీలు

హైదరాబాద్: క‌రోనా చికిత్స పొందుతున్న న‌లుగురు ఖైదీలు గాంధీ ద‌వాఖాన‌ నుంచి పరారయ్యారు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న న‌లుగురు ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని న‌గ‌రంలోని ఎర్రగడ్డ ఛాతీ ద‌వాఖాన‌కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వ‌హించ‌గా వారికి పాజిటివ్‌ వ‌చ్చింది. దీంతో వారిని చికిత్స నిమిత్తం అక్కడినుంచి గాంధీ ద‌వాఖాన‌కు తరలించారు. వారికి ద‌వాఖాన‌లోని మొద‌టి అంత‌స్తులో ఉన్న ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నారు. 

అయితే బాత్‌రూమ్ అని చెప్పిన వెళ్లిన ఆ న‌లుగురు ఖైదీలు బుధ‌వారం అర్ధ‌రాత్రి ద‌వాఖాన నుంచి పారిపోయారు. దీంతో ఆస్పత్రి సమీపంలో సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారికోసం ద‌వాఖాన ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తున్నారు. గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. ద‌వాఖాన నుంచి త‌ప్పించుకున్న ఖైదీని పోలీసులు రెండు రోజుల్లోనే ప‌ట్టుకున్నారు. 


logo