బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 16:02:50

విషవాయువు లీకై నలుగురు మృతి

విషవాయువు లీకై నలుగురు మృతి

అహ్మదాబాద్‌ : రసాయన వ్యర్థాలు కలిగిన ట్యాంకు శుభ్రపరుస్తుండగా టాక్సిక్ గ్యాస్ లీక్ కావడంతో నలుగురు కార్మికులు మృతిచెందారు. గుజరాత్‌ రాష్ర్టంలోని అహ్మదాబాద్‌ ధోల్కాలోని చిరిపాల్ గ్రూప్స్‌కు చెందిన బట్టల కర్మాగారంలో రసాయన వ్యర్థ ట్యాంకును శుభ్రం చేస్తుండగా శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

అహ్మదాబాద్ డీఎస్పీ నితేష్ పాండే మాట్లాడుతూ "నలుగురు కార్మికులు రసాయన వ్యర్థ ట్యాంకును శుభ్రం చేస్తున్నారు, అప్పుడు రసాయన వ్యర్థ ట్యాంక్ నుంచి విష వాయువు విడుదలైంది. ఈ విషవాయువు పీల్చి నలుగురు కూలీలు వాంతులు చేసుకొని అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామ’’ని ఆయన తెలిపారు. 

అయితే విషపూరిత వాయువు ఎలా లీక్‌  అయ్యిందో ఇంకా తెలియరాలేదు.  అంతకుముందు మే 7న విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్లాంట్‌లో గ్యాస్ లీకై సుమారు 11 మంది మరణించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కంపెనీ సీఈఓ, టెక్నికల్ డైరెక్టర్‌తో సహా 12 మందిని అరెస్టు చేశారు. గ్యాస్ లీక్ సంఘటన తరువాత చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo