మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 16:55:40

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

అమరావతి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తల్లి, అమ్మమ్మ తామూ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాడితోట అండ్కర్‌నగర్‌లో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కుటుంబకలహాలే ఆత్మహత్యలకు కారణం అని పోలీసులు గుర్తించారు. మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55), భూపతి శివపావని (27), నిషాన్‌ (9), రితిక (7)గా గుర్తించారు. శివపావని భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే మనస్థాపంతో వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.