శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 12:07:38

కాల్వలోకి దుసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

 కాల్వలోకి దుసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు

సోనిపట్‌ : దేశ రాజధాని సరిహద్దులోని  సోనిపట్ జిల్లాలో నహ్రా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఢిల్లీలోని మెహ్రౌలిలో రవాణా వ్యాపారం చేస్తున్న సాధురామ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కారులో శుక్రవారం రాత్రి సోనిపట్ జిల్లాలోని గార్హి బింద్రౌలీకి బయల్దేరాడు. నహ్రా గ్రామ శివారు వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ ఈదుతూ కాల్వ నుంచి సురక్షితంగా బయటపడగా సాధురామ్ (56), అతని భార్య సీమా (46), కుమారులు మాంటీ (17), ధ్రువ్ (15) గల్లంతయ్యారు. నలుగురు కారులోనే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్వ నుంచి కారును వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo