e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News పోలీసుల పేరుతో జ్యూవెల‌ర్ల‌కు టోక‌రా

పోలీసుల పేరుతో జ్యూవెల‌ర్ల‌కు టోక‌రా

పోలీసుల పేరుతో జ్యూవెల‌ర్ల‌కు టోక‌రా

ముంబై : పోలీసుల‌మ‌ని ఫోజులు కొడుతూ ప్ర‌జ‌ల నుంచి బ‌ల‌వంతంగా డ‌బ్బులు, విలువైన వ‌స్తువుల‌ను గుంజుతున్న న‌లుగురు నేర‌గాళ్ల ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసుల‌మ‌ని చెబుతూ వీరు న‌గ‌రంలోని ప‌లు జ్యూవెల‌రీ వ్యాపారుల‌ను బెదిరించి రూ కోట్లు వ‌సూలు చేశారు. సెవ్రీ, వ‌దాల వంటి ప‌లు ప్రాంతాల్లో వీరు ఈ త‌ర‌హా మోసాల‌కు పాల్ప‌డ్డారు.

సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల‌ను గుర్తించిన పోలీసులు బైకుల్లా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. ఇదే ప్రాంతంలోని దాదాజీ కొందేవ్ మార్గ్ లోని ఓ జ్యూవెల‌ర్ ను నిందితులు లైసెన్స్ చూప‌మ‌ని బెదిరించి అత‌డి నుంచి రూ 1.2 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాల‌ను రూ 60,000 న‌గ‌దును బ‌ల‌వంతంగా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పోలీసుల పేరుతో జ్యూవెల‌ర్ల‌కు టోక‌రా

ట్రెండింగ్‌

Advertisement