భర్తను కట్టేసి భార్యపై నలుగురు సామూహిక లైంగిక దాడి

చండీగఢ్: భర్తను కట్టేసి భార్యపై నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. నేపాల్‌కు చెందిన 37 ఏండ్ల మహిళ భర్తతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని జీవిస్తున్నారు. రెండేండ్ల పాపతో కలిసి ఆ ఫార్మ్‌లోని నీటి పంపు గదిలో ఉంటున్నారు. ఈ నెల 24న భర్త బయట పడుకోగా, ఆ మహిళ తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రించింది. కాగా, రాత్రి 11 గంటలకు ఐదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి అక్కడకు వచ్చారు. బయట నిద్రిస్తున్న భర్తను తాళ్లతో కట్టేశారు. ఇంట్లోకి వెళ్లిన నలుగురు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఐదో వ్యక్తి కూడా లైంగికదాడి చేయబోగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆ నేపాలీ మహిళ భర్త కట్లు విప్పింది. భూ యజమానికి ఈ విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. దీంతో పోలీసులు ఐదుగురు వ్యక్తులపై సామూహిక లైంగికదాడితోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి