శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 19:43:05

మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు దుర్మరణం

మెద‌క్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు దుర్మరణం

మెద‌క్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద ఆటో, కారు ఒక‌దానినొక‌టి ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఆటోలో ప్ర‌యాణిస్తున్న నలుగురు ప్ర‌యాణికులు దుర్మరణం చెందారు. ఆటో అప్పాజీపల్లి నుంచి మెదక్ వైపు వస్తుండగా హైద్రాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న కార్ ఢీకొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ప్రయాణీకులు ఉన్నారు. అందులో కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు చాకలి శ్రీవర్శిని (2), వరిగుంతం గ్రామానికి చెందిన ముత్యాల (46), అప్పాజిపల్లి గ్రామానికి చెందిన అతినగరం సుమలత(25) మ‌రొక‌రు అక్కడికక్కడే మృతిచెందారు. కిష్టాపూర్‌కు చెందిన తల్లీ కొడుకులు చాకలి ఇందిర, చాకలి వర్షిత్, వరిగుంతం గ్రామానికి చెందిన ముత్యాల స్వామి పరిస్థితి విషమంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. 


logo