Crime
- Jan 28, 2021 , 10:16:16
VIDEOS
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

బెంగళూరు : రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయ్బాగ్ తాలూకలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులను అన్నప్ప (60), మహాదేవి (50), సంతోష్ (26), దత్తాత్రేయ (28)గా గుర్తించారు. వీరిది రాయ్బాగ్ తాలుకలోని భీరాడి గ్రామం. అయితే అన్నప్ప, మహాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. అప్పులతో పాటు అప్పు ఇచ్చిన వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
MOST READ
TRENDING