మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 17:15:52

క‌ల‌హండిలో ఎదురుకాల్పులు.. న‌లుగురు మావోయిస్టులు హ‌తం

క‌ల‌హండిలో ఎదురుకాల్పులు.. న‌లుగురు మావోయిస్టులు హ‌తం

భువ‌నేశ్వ‌ర్ : ఎదురు కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న ఒడిశా రాష్ర్టం క‌ల‌హండి జిల్లాలోని క‌ల‌హండి-కంద‌మాల్ సరిహద్దు బండ‌రంగి సిర్కి అట‌వీ ప్రాంతంలో నేడు చోటుచేసుకుంది. భ‌ద్ర‌తా బ‌ల‌గాల సిబ్బందికి, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో న‌లుగురు మావోయిస్టులు మృతిచెంద‌గా ఒడిశా స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్‌కు చెందిన ఓ జ‌వాను గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్‌(డీవీఎఫ్‌)తో క‌లిసి ఎస్‌వోజీ మంగ‌ళ‌వారం నుంచి కూంబింగ్ ఆప‌రేష‌న్‌ను చేప‌ట్టాయి. ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు ఇరువ‌ర్గాల మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగున్న‌ర గంట‌లపాటు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘ‌ట‌నా స్థ‌లంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు.


logo