మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 13:56:15

బోరు లారీ బోల్తా.. నలుగురు మృతి

బోరు లారీ బోల్తా.. నలుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బుధవారం బోరు లారీ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం వద్ద  ఈ ఘటన జరిగింది.

కర్ణాటక రాష్ట్రం చేలూరు మండలం పాల చెరువు వద్ద పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. లారీలో ప్రయాణిస్తున్నమధ్యప్రదేశ్‌లోని  సింగరోలి జిల్లా చిత్రంగి తాలుకా దేచువ గ్రామానికి చెందిన జయదేవ్‌,నవదేశ్‌, రాజారామ్‌, సుబ్రమణ్యం అక్కడికక్కడే చనిపోయారు.  మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం  బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. 


logo