మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 02, 2020 , 09:36:40

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

గుంటూరు: జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు . జాతీయ రహదారిపై జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

తిమ్మపురం వద్ద  జాతీయ రహదారిపై వెళ్తున్నకారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీ కొట్టింది.దీంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. వీరి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందారు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo