శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 19:57:27

చంద్రభాగ నదిలో స్నానానికి వెళ్లి.. నలుగురు మృతి

చంద్రభాగ నదిలో స్నానానికి వెళ్లి.. నలుగురు మృతి

అమరావతి : నదీ స్నానానికి వెళ్లిన ముగ్గురు పిల్లలతో సహా ఓ మహిళ మృత్యువాత పడగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ధమంగవ్‌ రైల్వే తాలూకాలోని తాలూకాలోని నింఫోరా రాజ్‌ గ్రామంలో నివసించే ఓ కుటుంబం ఆదివారం ఉదయం 6 గంటలకు గ్రామ శివారులోని చంద్రభాగ నదిలో స్నానాలు చేసి, పూజలు చేసేందుకు నదీ తీరానికి వెళ్లారు.

ఈ క్రమంలో చిన్నారులతో పాటు మిగతా వారంతా స్నానాలు చేసేందుకు నీటిలో దిగారు. దీంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేకపోయారు. గమనించిన స్థానికులు ఒడ్డుకు తీసుకురాగా అప్పటికే ముగ్గురు చిన్నారులతో మరో మహిళ మృత్యువాత పడింది. మరో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే అమరావతి జిల్లా జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు.

మృతులను యశ్ ప్రమోద్ చావ్రే (11), జీవన్ ప్రదీప్ చావ్రే (15), సోహం దినేష్ జెలే (12), చిముకళ్యాంచె, పుష్ప దిలీప్ చావ్రే (32)గా గుర్తించారు. బేబీ ప్రదీప్ చావ్రే (35), రాధా గోపాల్‌రావ్ మాలియే (38) పరిస్థితి విషమంగా ఉంది. కాగా, చంద్రభాగ నది పెద్దది కానప్పటికీ.. గత సంవత్సరం నుంచి లోతు పెరిగింది. హైవే కోసం నదీ పరీవాహక ప్రాంతంలో మూడు మీటర్ల మేరకు మట్టి తవ్వడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది.

కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టిని తవ్వడంతో లోతు పది మీటర్లకు చేరిందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో పలుసార్లు నది లోతు పెరగడంపై ఆందోళనలూ చేశారు. అక్రమంగా మట్టిని తవ్విని కాంట్రాక్టర్‌పై చర్య తీసుకునే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని గ్రామస్తులు భీష్మించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ అడ్సాద్ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని తాలూకా పరిపాలనను ఆదేశించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo