గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 03, 2020 , 16:12:27

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

కోర్బా: ఛత్తీస్‌ఘడ్‌ రాష్ర్టం కోర్బా జిల్లాలో సోమవారం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్‌తో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. 

వివరాలు.. బీహార్‌కు చెందిన మోనికుమారి(32) కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి పదోరోజు కర్మకు బీహార్‌ నుంచి కోర్బాకు కారులో ఆదివారం రాత్రి బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున అంబికాపూర్‌-కోర్బా హైవేలోని బాంగో పోలీస్ స్టేషన్ పరిధిలోని పాట్ల గ్రామ సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రలోకి జారుకొని రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో మోనికుమార్‌తో సహా కుటుంబసభ్యులు దీపక్ కుమార్ శర్మ (22), త్రిపురారీ శర్మ (32), డ్రైవర్ శంకర్ కహార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. 

మోని కుమార్తె మాన్వి (6), కుమారులు మానవ్ (6), మయాంక్ (4) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోర్బాలోని దవాఖానకు తరలించగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని కట్ఘోరా సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీఓపీ)పోలీసు పంకజ్ పటేల్ తెలిపారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo