శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 11:13:55

నకిలీ మద్యం సేవించి నలుగురు మృతి

నకిలీ మద్యం సేవించి నలుగురు మృతి

అమృత్‌సర్‌ : పంజాబ్‌ రాష్ర్టం అమృత్‌సర్‌లోని ముచ్చల్ గ్రామంలో గురువారం నకిలీ మద్యం సేవించి నలుగురు మృతిచెందారు. మొదట ఆరుగురు మృతి చెందారని స్థానికులు వాపోతుండగా నలుగురు మాత్రమే మృతి చెందినట్లు పోలీసు అధికారి అమోలక్ సింగ్ అన్నారు.

ఈ ఘటనపై ఓ మృతుడి కుమారుడు హర్జీత్‌ సింగ్‌ మాట్లాడుతూ బుధవారం తన తండ్రితో పాటు మరో ముగ్గురు నకిలీ మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. తన తండ్రికి బీపీ డౌన్‌ కావడంతో వెంటనే దవాఖానకు తీసుకువెళ్లామని చికిత్స పొందుతూ మరణించాడని తెలిపాడు. మిగతా ముగ్గురు కూడా ఇదే విధంగా మృతి చెందినట్లు తెలిసిందన్నాడు. ఈ గ్రామంలో నకిలీ మద్యం దందా జోరుగా సాగుతోందని అధికారులు, పోలీసులకు దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.  

అయితే నకిలీ మద్యం సేవించి ఇక్కడ మొత్తం ఆరుగురు చనిపోతే పోలీసులు నలుగురే అని చెప్పడంలో మతలబు ఏంటో అర్థం కావడం లేదని చనిపోయిన వారిలో ఒకరి తల్లి చెప్పింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo