బుధవారం 27 జనవరి 2021
Crime - Sep 22, 2020 , 15:24:45

జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడి ఘ‌ట‌న‌లో న‌లుగురు అరెస్టు

జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడి ఘ‌ట‌న‌లో న‌లుగురు అరెస్టు

హైద‌రాబాద్ : జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి చేసిన ఆరోపణలపై న‌లుగురు వ్య‌క్తుల‌ను న‌గ‌రంలోని మియాపూర్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. నిందితులు కరీం ఆజాద్, ఆఫ్రోజ్, ఇమ్రాన్, సల్మాన్‌ను అరెస్టు చేసిన‌ట్లుగా పోలీసులు తెలిపారు. హఫీజ్‌పేట్ వద్ద అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులతో వీరు వాగ్వాదానికి దిగారు. అధికారులపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన‌ట్లుగా స‌మాచారం. అధికారుల‌ ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుల‌ను అరెస్టు చేశారు.logo