మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 13:04:00

నలుగురు డెబిట్‌ కార్డు స్నాచర్స్‌ అరెస్టు

నలుగురు డెబిట్‌ కార్డు స్నాచర్స్‌ అరెస్టు

గౌతమ్‌బుద్ధనగర్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌రాష్ర్టం గౌతమ్‌ బుద్ధనగర్‌లో దుండగులు, పోలీసుల మద్య ఎదురు కాల్పుల అనంతరం పోలీసులు సోమవారం నలుగురు దొంగలను అరెస్టు చేశారు. సుర్జాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సెక్టార్ 144 ఆక్సిజన్‌ పార్కు వెనుక చుట్టుపక్కల ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా, నలుగురు వ్యక్తులు సెక్టార్ వెనుక భాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించినట్లు జిల్లా అదనపు కమిషనర్‌ అంకుర్‌ అగర్వాల్‌ తెలిపారు. కారులోని వ్యక్తులను విచారణకు వెళ్లినప్పుడు వారు పారిపోతూ పోలీసులపై కాల్పులు జరిపారు. తిరిగి పోలీసులు కూడా కాల్పులు జరుపడంతో ముగ్గురు దుండగులు గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. 

ఈ ముఠా గన్‌పాయింట్‌ వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దోచుకోవడం, వారిని బెదిరించి డెబిట్‌ కార్డులను తీసుకొని పిన్‌ అడిగేవారని గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి మొత్తం 21 ఏటీఎం కార్డులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.logo