మంగళవారం 26 మే 2020
Crime - May 21, 2020 , 18:33:42

బావిలో పడి నలుగురి మృతి

బావిలో పడి నలుగురి మృతి

వరంగల్ రూరల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని గీసుగొండ మండలం గొర్రెకుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలో గల ఓ బావిలో పడి నలుగురు మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న గీసుగొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో చిన్నారి, ఇద్దరు మహిళలు, ఓవ్యక్తి ఉన్నట్లుగా గుర్తించారు. మృతులంతా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారిగా నిర్దారించారు. బతుకు దెరువు కోసం ఇరవై ఏండ్ల క్రితం వరంగల్ కు వలస వచ్చిగోనె సంచుల పరిశ్రమలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo