బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 04, 2020 , 19:09:56

తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

మహబూబాబాద్‌ : జిల్లాలోని మహబూబాబాద్‌ మండలం శనిగాపురం బొడాతాండలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి తుమ్మల్‌ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతిచెందారు. చనిపోయిన చిన్నారుల వివరాలిలా ఉన్నాయి. ఇస్లావత్‌ లోకేశ్‌(12), ఇస్లావత్‌ రాకేష్‌(12), బోడా దినేష్‌(10), బోడా జగన్‌(8). మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. నలుగురు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.



logo