సోమవారం 13 జూలై 2020
Crime - Apr 25, 2020 , 16:26:30

సామూహిక అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు

సామూహిక అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌ పరిధిలోని సురారం కాలనీకి చెందిన బాలికపై ఈ నెల 22న సామూహిక అత్యాచారానికి గురైంది. నిందితులు దేవేందర్‌నగర్‌లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.


logo