మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 14:38:01

బాలికను అపహరించి.. విక్రయించాలని చూసిన నలుగురు అరెస్ట్‌

బాలికను అపహరించి.. విక్రయించాలని చూసిన నలుగురు అరెస్ట్‌

ముజాఫర్ నగర్ : 18 ఏండ్ల బాలికను అపహరించి వేరే రాష్ర్టాలకు విక్రయించాలని చూసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం ముజాఫర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ముజఫర్‌నగర్‌ జిల్లా సిఖేడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏండ్ల బాలికను అదే జిల్లాకు చెందిన కరం వీర్, సరోజ్, రాధిక, పూజ అనే నిందితులు ఆగస్టు 18న మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌ చేశారు. ఆమెను హర్యానాలోని పానిపట్‌లోని ఓ ఇంట్లో ఉంచి డబ్బు కోసం మరో వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరుసటి రోజు బాలిక స్పృహలోకి వచ్చి ఎలాగో అలా వారి నుంచి తప్పించుకొని తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఆ తరువాత వారు పిల్లల సంరక్షణ హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా వారు ఆగస్టు 22న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు  శనివారం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo