సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 20:29:33

రెండు కర్మాగారాల నుంచి 48 మంది బాలకార్మికులను రక్షించారు

రెండు కర్మాగారాల నుంచి 48 మంది బాలకార్మికులను రక్షించారు

చండీఘర్‌ : పంజాబ్‌లోని జలంధర్ నగరంలో గల రెండు కర్మాగారాల నుంచి 48 మంది బాల కార్మికుల(35 మంది బాలురు, 13 మంది బాలికల)ను రక్షించినట్లు ప్రభుత్వ ప్రతినిధి శనివారం తెలిపారు. అనంతరం బాల కార్మిక సవరణ చట్టం- 2016 కింద రెండు కర్మాగారాల యజమానులకు సమన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి బాల కార్మికులను హోషియార్పూర్ పట్టణంలోని అనాథాశ్రమానికి తరలించినట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులను నిర్బంధంలో ఉచినట్లు అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo