బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 09, 2020 , 18:45:01

ఫోర్జరీ కేసులో మాజీ సర్పంచ్‌ అరెస్టు

ఫోర్జరీ కేసులో మాజీ సర్పంచ్‌ అరెస్టు

రంగారెడ్డి : మోసం, ఫోర్జ‌రీ కేసులో పెద్ద షాపూర్ మాజీ స‌ర్పంచ్‌ను శంషాబాద్ పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. ప‌ర్మిష‌న్ లెట‌ర్స్‌పై అధికార ర‌బ్బ‌ర్ స్టాంప్స్‌ను ఉప‌యోగించి త‌న కుటుంబ స‌భ్యుల పేర బిల్డింగ్ నిర్మాణ అనుమ‌తులు మంజూరు చేయ‌డంపై పోలీసులు ఇత‌న్ని అరెస్టు చేశారు. ఎస్‌. ఇస్రా నాయ‌క్ 2011లో గ్రామ సర్పంచ్‌గా ప‌నిచేశాడు. అయితే ఇప్ప‌టికి తానే స‌ర్పంచ్‌న‌ని చెప్పుకుంటూ పేద‌ల‌ను, ఇండ్లులేని నిరాశ్ర‌యుల‌ను మోస‌గిస్తున్నాడు. జే. రాజీ రెడ్డితో పాటు ఇత‌ర అనుచ‌రుల‌తో క‌లిసి గ్రామంలోని భూమిని లాక్కొని ప్లాట్లుగా చేసి అమ్ముతున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి నాయ‌క్‌ను అరెస్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు. 


logo