ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 09:40:25

భూ కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

భూ కబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

బలరాంపూర్‌ : భూ ఆక్రమణ కేసులో ఉత్తర ప్రదేశ్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. 2018లో ప్రభుత్వం పాఠశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కాజేసినట్లు మాజీ ఎమ్మెల్యే ఆరీఫ్ అన్వర్ హష్మీపై అభియోగాలుండటంతో అప్పట్లో కేసు నమోదైంది. జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తులో మాజీ శాసనసభ్యుడిపై వచ్చిన అభియోగాలు నిజమని తేలడంతో శనివారం హష్మీని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ దేవ్ రంజన్ వర్మ తెలిపారు.

సాదుల్లా నగర్‌లోని సమాజ్‌ వాదీ పార్టీ కార్యాలయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు అతడి సోదరుడు మెరూఫ్ అన్వర్ హష్మీ ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదించినట్లు పోలీసులు తెలిపారు. ఆరీఫ్ అన్వర్ హష్మీ 2007 నుంచి 2012 వరకు బలరాంపూర్‌ జిల్లా ఉట్రౌలా నియోజకవర్గానికి సమాజ్‌ వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo