ముంబై : నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మాజీ మిస్టర్ ఇండియా టైటిల్ విజేత, బాడీ బిల్డర్ తన ముంబై నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్‌స్టాగ్రాంలో తాను కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా వాటిపై నిందితుడు ట్రోల్ చేశాడని నోట్లో పేర్కొన్న బాధితుడు ఆపై నిద్ర మాత్రలు మింగి తనువుచాలించేందుకు ప్రయత్నించాడు. పరిస్ధితి గమనించిన తల్లితండ్రులు అతడిని హుటాహుటిన దవాఖానకు తరలించారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. సదరు నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడని బాధితుడు ఆరోపించాడని ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు వెల్లడించారు. బాధితుడి స్టేట్మెంట్ను రికార్డు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు.