ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 29, 2020 , 13:45:10

పోలీసుపై చేయి చేసుకున్న మాజీ ఎంపీ

పోలీసుపై చేయి చేసుకున్న మాజీ ఎంపీ

చెన్నై : మాజీ ఎంపీ, డీఎంకే పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కే అర్జున‌న్.. డ్యూటీలో ఉన్న పోలీసు ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. త‌మిళ‌నాడు సేలంలోని ఓ టోల్ గేట్ వ‌ద్ద మాజీ ఎంపీ కారును పోలీసులు ఆపారు. పోలీసులు జారీ చేసిన ఈ-పాస్ ను చూపించాల‌ని ఆ నాయ‌కుడిని అడిగారు. దీంతో కోపోద్రిక్తుడైన మాజీ ఎంపీ.. పోలీసుపై చేయి చేసుకున్నాడు. అత‌న్ని త‌న్నుతూ.. తోసేశాడు అర్జున‌న్. అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలంతో దూషించారు. ఈ దృశ్యాల‌న్నీ టోల్ గేట్ వ‌ద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.  

క‌రోనా వ్యాప్తి దృష్ట్యా.. రాష్ర్టంలో ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్లాలంటే క‌చ్చితంగా ఈ-పాస్ ఉండాలి. లేని యెడ‌ల వారి వాహ‌నాన్ని అనుమ‌తించ‌రు. మాజీ ఎంపీ వ‌ద్ద ఈ-పాస్ లేక‌పోవ‌డంతో ఆయ‌న కారును ఆపారు. 

త‌మిళ‌నాడులో క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉన్న నాలుగు జిల్లాలు చెన్నై, చెంగ‌ల్ పేట్, కంచీపురం, తిరువ‌ల్లూరులో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం జూన్ 15వ తేదీన ప్ర‌క‌టించింది. త‌మిళ‌నాడులో ఆదివారం ఒక్క‌రోజే 3,940 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 54 మంది మ‌ర‌ణించారు.    


logo