గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 14:32:58

అశ్లీల వీడియో కేసులో మాజీ మంత్రిపై కేసు

అశ్లీల వీడియో కేసులో మాజీ మంత్రిపై కేసు

రాజస్థాన్‌: మాజీ మంత్రి కలులాల్ గుర్జర్ పై కేసు నమోదైంది. తన మొబైల్ ఫోన్‌ నుంచి పంపిన అశ్లీల వీడియో క్లిప్ కేసులో చిక్కుకున్నారు. ఆయనపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన మొబైల్‌ను ఎవరో దుర్వినియోగం చేశారని, రాజకీయ కుట్రలో చిక్కుకున్నానని గుర్జార్ ఆరోపిస్తున్నారు. కలులాల్ గుర్జార్ మొబైల్ నంబర్ నుంచి కొన్ని అశ్లీల వీడియోలు వాట్సాప్ గ్రూపులో వచ్చాయి. భిల్వారాలోని మండల్, సహదా, భిల్వారా డివిజన్లకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఈ గ్రూపులో ఉన్నారు. మాజా మంత్రిగారి ఫోన్‌ నుంచి వచ్చిన అశ్లీల వీడియోలను చూసిన కార్యకర్తలు షాక్ అయ్యారు.

బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షుడు కమేలేంద్ర సింగ్ గుధ.. గుర్జర్‌పై ఐటి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మండల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మేమంతా సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపులో మాజీ మంత్రి కలులాల్ గుర్జార్ అసభ్యకరంగా ఉన్న మహిళల వీడియో క్లిప్పింగ్ పెట్టారని ఆయన చెప్పారు. కమలేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు ఐటీ చట్టంలోని 67, 67-ఏ సెక్షన్ల కింద మాజీ మంత్రి కలులాల్ గుర్జర్‌పై కేసు నమోదు చేసినట్లు మండల పోలీసు అధికారి రాజేంద్ర సింగ్ గోదారా తెలిపారు. 

గత అసెంబ్లీ ఎన్నికలలో నన్ను ఓడించిన వారు మాత్రమే ఈ కుట్రకు ప్రధాన కారకులని గుర్జార్ చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నా క్లీన్ ఇమేజ్ కారణంగా పార్టీ నాకు మళ్ళీ టికెట్ ఇస్తుందనే భయంతో వారు ఉండి ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిరోజూ వందలాది మంది కార్మికులు, ప్రజలు నా వద్దకు వస్తారని, ఇటువంటి పరిస్థితిలో ఎవరో నా మొబైల్‌ను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. గుర్జార్‌ 1990, 1993, 2003, 2013 ఎన్నికల్లో భిల్వారా జిల్లాలోని మండల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలు నాలుగుసార్లు ఎన్నికయ్యారు. బీజేపీ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు.


logo