మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 09, 2020 , 21:20:17

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి

వ‌రంగ‌ల్ రూర‌ల్ : ‌విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన‌ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా పర్వ‌త‌గిరి మండ‌లం రోళ్ల‌క‌ల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాలు.. గ్రామానికి చెందిన నిమ్మ‌నాయ‌క్ (55) రోజువారి కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా బుధ‌వారం సాయంత్రం త‌న వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు. పైరుకు నీరు పెడ‌దామ‌ని బోరు ఆన్ చేసే క్ర‌మంలో విద్యుదాఘాతానికి గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద‌దిక్కును కోల్పోవ‌డంతో మృతుడి భార్య‌, పిల్ల‌లు రోదిస్తున్న తీరు స్థానికుల‌ను కంట‌త‌డి పెట్టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo