గురువారం 04 మార్చి 2021
Crime - Jan 28, 2021 , 20:48:12

జనగామలో మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య..

జనగామలో మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య..

జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకుడు, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ పులి స్వామి (53) గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. హన్మకొండ హైవేపై మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వెనుకనుంచి ఢీకొట్టి గొడ్డలితో తలపై నరికి చంపారు. హత్య జనగామ మండలం యశ్వంతపూర్‌ హైవే బైపాస్‌ సమీపంలోని అత్యంత విలువైన భూమి వివాదం కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుండగా, హత్యకు భూ వివాదాలు సహా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సంఘటనా స్థలాన్ని జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌ సందర్శించి హత్య సంఘటన వివరాలు, క్లూస్‌ టీం ద్వారా నిందితులకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. యశ్వంతపూర్‌ వద్ద జాతీయ రహదారిపై విలువైన భూమికి సంబంధించి బుధవారం కోర్టు కేసులో తీర్పు పులి స్వామికి అనుకూలంగా రావడంతో హత్య జరిగినట్లు భావిస్తున్నామని ఏసీపీ తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేసి శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి..

లష్కర్‌ వారం ఆదాయం రూ.40,16,738

గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

దేశం అబ్బురపడేలా అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు 

‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్’‌ 


VIDEOS

logo