హైదరాబాద్ : కొకైన్ విక్రయిస్తున్న విదేశీయుడు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఘనా దేశానికి చెందిన జోసెఫ్ టాగోయ్(28) అనే వ్యక్తి గత కొంతకాలంగా నారాయణగూడ పీఎస్ పరిధిలో నివసిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి జోసెఫ్ టాగోయ్ నుంచి 30 గ్రాముల కొకైన్, రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.