బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 12:17:45

చీరెలు, చొక్కాల మధ్య విదేశీ, దేశీయ కరెన్సీ

చీరెలు, చొక్కాల మధ్య విదేశీ, దేశీయ కరెన్సీ

చెన్నై :  తమిళనాడు రాజధాని చెన్నై విమానాశ్రయం నుంచి అక్రమంగా తరలించేందుకు యత్నించిన రూ. కోటి 36 లక్షల విలువైన విదేశీ, దేశీయ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం కొరియర్లలో అక్రమంగా విదేశీ నగదు తరలించే అవకాశముందని అధికారులకు విశ్వనీయ సమాచారం అందింది. ఈ మేరకు సింగపూర్‌ టర్మినల్‌ నుంచి ఆ దేశానికి పంపుతున్న మూడు పార్సిళ్లను అనుమానం వచ్చి తనిఖీ చేశారు. పార్సిళ్లలోని చీరెలు, చొక్కాల నడుమ 50 వేల డాలర్లు, 4 వేల పౌండ్లు, రూ .30 లక్షలు దేశీయ కరెన్సీతో సహా మొత్తం  రూ. 1.36 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి తెలిపారు. పార్సిళ్లపై పేరున్న ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo