బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 15, 2020 , 16:19:56

బైక్‌లు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఐదేళ్ల బాలుడు దుర్మ‌ర‌ణం

బైక్‌లు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఐదేళ్ల బాలుడు దుర్మ‌ర‌ణం

జ‌గిత్యాల : ఎదురెదురుగా వ‌స్తున్నరెండు బైక్‌లు అదుపుత‌ప్పి ఒక‌దానినొక‌టి ఢీకొన్నాయి. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఐదేళ్ల బాలుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా రాయిక‌ల్ పోలీస్ స్టేష‌న్ ముందు చోటుచేసుకుంది. ఆలూరు గ్రామానికి చెందిన వ్ర‌తాన్ని వెంక‌ట్‌రెడ్డి త‌న భార్య‌, కొడుకుతో క‌లిసి బైక్‌పై వెళ్తున్నాడు. కాగా రాయికల్ పోలీస్ స్టేషన్ ముందు ప్రధాన రహదారిపై చేరుకునేస‌రికి ఎదురుగా వ‌చ్చిన మ‌రో బైక్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్క‌డే మృతిచెంద‌గా వెంక‌ట్‌రెడ్డి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. భార్య స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు.


logo