గురువారం 21 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 16:45:00

ట్రాక్టర్‌ పల్టీకొట్టి ఐదుగురు మహిళలు దుర్మరణం

ట్రాక్టర్‌ పల్టీకొట్టి ఐదుగురు మహిళలు దుర్మరణం

బెంగళూర్‌ : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మంజుకొండపల్లి- తప్పకులి రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీతోసహా పల్టీకొట్టడంతో ఐదుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. కర్ణాటకలోని రామనగర జిల్లా కనకాపురం తాలూకా కొరలాల్‌ చంద్ర గ్రామానికి చెందిన 25 మంది మహిళలు తమిళనాడులోని యాంచెట్టి జిల్లా తప్పకులి గ్రామంలో ఆలయాన్ని సందర్శించేందుకు ట్రాక్టర్‌లో బయల్దేరారు.

తప్పకూలి శివారుకు రాగానే ట్రాక్టర్‌ యాగ్జిల్‌ రాడ్డు విరిగిపోవడంతో డ్రైవర్‌ గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్‌ ట్రాలీతో సహా అదుపుతప్పి రోడ్డు దిగువకు పల్టీలు కొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయపడినట్లు యాంచెట్టి పోలీసులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం యాంచెట్టి, హోసూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూర్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ఘటనపై యాంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo