శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 18:17:44

బండిపోరాలో ఐదుగురు ఉగ్రవాద సహచరులు అరెస్టు

బండిపోరాలో ఐదుగురు ఉగ్రవాద సహచరులు అరెస్టు

బండిపోరా (జమ్ము కశ్మీర్‌) : ఐఎస్‌జేకే సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాద సహచరులను బండిపోరా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిలో నలుగురు బండిపోరాకు చెందిన వారు కాగా.. ఒకరు శ్రీనగర్ కు చెందినవాడు. వారి నుంచి మాట్రిక్స్‌ షీట్లు, ఐఎస్‌జేకే ఉగ్రవాద సంస్థకు చెందిన జెండాలు, కొంత మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వీరందరు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌జేకేకు అనుబంధంగా ఉన్నారని, అంతేకాకుండా వీరు యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తుంటారని, చిట్టిబండి అరగాంలో ఐఎస్‌జేకే జెండాలను తయారు చేసి శ్రీనగర్‌లోని వారి సహచరులకు సరఫరా చేస్తుంటారని జమ్ము కశ్మీర్‌ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo