మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 15:10:01

నాలుగేళ్ల బాలుడితో స‌హా ఐదుగురు కుటుంబ స‌భ్యులు ఆత్మ‌హ‌త్య‌!

నాలుగేళ్ల బాలుడితో స‌హా ఐదుగురు కుటుంబ స‌భ్యులు ఆత్మ‌హ‌త్య‌!

భోపాల్ : నాలుగేళ్ల చిన్నారితో స‌హా రిటైర్డ్ ప్ర‌భుత్వ ఉద్యోగి, అత‌ని భార్య‌, మ‌రో ముగ్గురు కుటుంబ స‌భ్యులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ విషాద సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని టిక‌మ్‌ఘ‌ర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ప్ర‌శాంత్ ఖేరీ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ... పొరిగింటివారు పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో సంఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి చూడ‌గా ఐదుగురు కుటుంబ స‌భ్యులు ఉరికి వ్రేలాడుతూ క‌నిపించార‌న్నారు. మృతుల‌ను ధ‌ర్మ‌దాస్ సోని(62), భార్య పూన‌(55), కొడుకు మ‌నోహ‌ర్‌(27), కొడ‌లు సోన‌మ్‌(25), నాలుగేళ్ల‌ మ‌న‌వడిగా గుర్తించిన‌ట్లు తెలిపారు. వీరి మృతికి కార‌ణం తెలియ‌రాలేద‌న్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు ఎస్పీ వెల్ల‌డించారు.


logo