శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 17:25:23

కుటుంబంలో ఐదుగురు ఉరేసుకొని ఆత్మహత్య

కుటుంబంలో ఐదుగురు ఉరేసుకొని ఆత్మహత్య

టికామ్‌ఘర్‌ : మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘర్‌ జిల్లా ఖార్గాపూర్‌ పట్టణంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ధర్మదాస్ సోని (62) భార్య, కుమారుడు, కోడలు, మనువరాలుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇంటి లోపల గడియపెట్టి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం వరకు ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావడం స్థానికులు పోలీసుల సమాచారం అందించారు.

పోలీసులను ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా ధర్మధాస్‌ సోనితోపాటు అతడి భార్య పూనా (55), కుమారుడు మనోహర్ (27), కుమార్తె లాసోనమ్ (25), నాలుగేళ్ల మనువరాలు ఉరితాడుకు వేలాడుతూ కనిపించారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ ఖరే తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo