జిలెటెన్ స్టిక్స్ పేలుడు.. ఆరుగురి మృతి

బెంగళూరు : కర్నాటక శివమొగ్గ చిక్‌బళ్లాపూర్ తాలూకలోని హిరెనాగవేలి భారీ పేలుడు సంభవించింది. జిలెటెన్ స్టిక్స్ పేలిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను జిల్లా హాస్పిటల్‌కు హాస్పిటల్‌కు తరలించారు. కాగా, పేలుడు ధాటికి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు ప్రకంపనలు వచ్చాయి. అలాగే వెయ్యి అడుగుల దూరం వరకు మృతదేహాలు ఎగిరిపడ్డాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా జిలెటిన్ స్టిక్స్ పేలినట్లు సమాచారం. వాటిని మైనింగ్ కోసం అక్రమంగా నిలువ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత జనవరిలోనూ శివమొగ్గ జిలిటెన్‌స్టిక్స్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!