శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 18:40:58

టోలిచౌకి దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్‌

టోలిచౌకి దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్‌

హైద‌రాబాద్ : గ‌త నెల‌లో టోలిచౌకిలో జ‌రిగిన దోపిడీ కేసులో ఐదుగురు స‌భ్యుల ముఠాను హైద‌రాబాద్ పోలీసులు సోమ‌వారం అరెస్టు చేశారు. ముఠా స‌భ్యుల నుంచి రూ. 1.28 కోట్లు, బైక్‌, మొబైల్ ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను మ‌హ్మ‌ద్ అఫ్స‌ర్(24), మీర్జా అశ్వ‌క్ బేగ్(22), ర‌హ్మ‌న్ బేగ్(23), మ‌హ్మ‌ద్ అమీర్(20), స‌య్య‌ద్ ఇమ్రాన్(23)గా గుర్తించిన‌ట్లు తెలిపారు. వీరంతా గొల్కోండ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఎండీ లైన్స్‌కు చెందిన‌వారు. 

నిందితుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీపీ అంజ‌నీ కుమార్ మాట్లాడారు. అస‌దుద్దీన్ అహ్మ‌ద్ అనే వ్యాపార‌వేత్త‌తో గ‌తంలో అఫ్స‌ర్, అశ్వ‌క్ ప‌ని చేశారు. అహ్మ‌ద్ వ్యాపార కార్య‌క‌లాపాల‌తో పాటు న‌గ‌దు లావాదేవీలన్నింటినీ అఫ్స‌ర్, అశ్వ‌క్ తెలుసుకున్నారు. ఈ ఏడాది జులై 21న అహ్మ‌ద్ శామీర్‌పేట‌లోని త‌న ఫాంహౌస్‌కు కుటుంబంతో క‌లిసి వెళ్లాడు. ఈ స‌మ‌యంలో అఫ్స‌ర్ త‌న గ్యాంగ్‌తో క‌లిసి అహ్మ‌ద్ ఇంటి తాళాలు ప‌గుల‌గొట్టి.. 2.5 కోట్లు దోచుకెళ్లారు. ఆ న‌గ‌దును ర‌హ్మ‌న్ నివాసంలో దాచి ఉంచారు. 

అసదుద్దీన్ అహ్మ‌ద్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అఫ్స‌ర్‌పైనే అహ్మ‌ద్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో అత‌డిని విచారించ‌గా చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. 


logo