చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్

తిరువనంతపురం: చిరుత పులిని బంధించి, వధించి, చంపి దాని మాంసాన్ని వండుకుని తిన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 74 ఏండ్ల కురియాకోస్, 45 ఏండ్ల వినోద్ కలిసి మునిపారా అటవీ సమీపంలోని మంకులర్లో ట్రాప్ వేయగా బుధవారం ఒక చిరుతపులి చిక్కింది. దీంతో దానిని బంధించి వినోద్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిరుతను చంపి మాంసాన్ని వండుకుని తిన్నారు. 54 ఏండ్ల సాలి కుంజప్పన్, 50 ఏండ్ల సీఎస్ బిను, 50 ఏండ్ల విన్సెట్ దీనికి సహకరించారు.
మరోవైపు అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో శుక్రవారం వినోద్ ఇంట్లో తనిఖీ చేయగా పది కేజీల చిరుత మాంసంతోపాటు దాని చర్మం, గోర్లు, పంటి భాగాలు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తన మేకను చిరుత చంపి తినడంతోనే దానిని బంధించాలని నిర్ణయించినట్లు నిందితుడు వినోద్ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు లేఖ రాలేదు..
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య