గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 18:28:34

ఎక్స్‌పైర్‌డ్ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్

ఎక్స్‌పైర్‌డ్ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్

జైపూర్ : ఎక్స్‌పైర్‌డ్ ఆహార పదార్థాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను జైపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుడ్ అండ్ హెల్త్ సిబ్బందితో కలిసి పోలీసులు శుక్రవారం సుమారు 20 చోట్ల దాడులు చేసి గడువు ముగిసిన ఆహార పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు.  

జైపూర్ పోలీసు కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఓ నకిలీ సంస్థ వివిధ బ్రాండ్ల ఆహార పదార్థాలను గడువు ముగిసిన తరువాత కూడా రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ముఠా తేదీ అయిపోయిన ఆహార పదార్థాల్లో వాసన రాకుండా పలు రకాల రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మోహిత్ జైన్, సుభాశ్ శర్మ, అమిత్ శర్మ, మనీశ్ శర్మ, స్వాప్నిల్ శర్మలను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo