శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 18:27:21

పులి దాడిలో మ‌త్స్య‌కారుడు మృతి

పులి దాడిలో మ‌త్స్య‌కారుడు మృతి

కోల్‌క‌తా : పులి దాడిలో ఓ మ‌త్స్య‌కారుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న ప‌శ్చిమ‌బెంగాల్‌లోని సుంద‌ర్‌బ‌న్ అట‌వీప్రాంతంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. మారిచ్‌జాపి ద్వీపంలో నిన్న చోటుచేసుకున్న‌ పులిదాడిలో పీత‌లు ప‌ట్టే ఓ వ్య‌క్తి చ‌నిపోయాడు. ఉత్తర 24 పరగనాస్ జిల్లాలోని హింగల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పరగమి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు బాగ్నా అటవీప్రాంతంలోని ఓ కాలువలో చేపలు ప‌ట్టేందుకు వెళ్లారు. అకస్మాత్తుగా ఓ పులి వీరిపైకి దూకి మున్నా గాజీ(40) అనే వ్య‌క్తిని చంపి అట‌వీప్రాంతంలోకి లాక్కుపోయింది. మిగ‌తా ఐదుగురు వ్య‌క్తులు పులిని త‌ర‌మ‌డంలో విజ‌య‌వంత‌మైన‌ప్ప‌టికీ అప్ప‌టికే మున్నా చ‌నిపోయాడు. గ‌డిచిన నెల రోజుల్లో సుంద‌ర్‌బ‌న్ అట‌వీ ప్రాంతంలో పులి దాడిలో చేప‌లు, పీత‌లు ప‌ట్టే ఏడుగురు వ్య‌క్తులు చ‌నిపోయారు. 


logo