బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 16:57:32

పాలేరు జలాశయంలో పడి మత్స్యకారుడు మృతి

పాలేరు జలాశయంలో పడి మత్స్యకారుడు మృతి

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఉల్లోజు నర్సయ్య(45) మంగళవారం సాయంత్రం చేపల వేట వెళ్లి ప్రమాదవశాత్తు పాలేరు జలాశయంలో పడి మృతి చెందాడు. తోటి మత్స్యకారులు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


logo