గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 17, 2020 , 22:01:13

సేంద్రీయ ఎరువుల కర్మాగారంలో మంటలు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

సేంద్రీయ ఎరువుల కర్మాగారంలో మంటలు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

పాల్ఘర్‌ (మహారాష్ర్ట) : పాల్ఘర్ జిల్లాలోని సేంద్రీయ రసాయన కర్మాగారంలో సోమవారం మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారని జిల్లా కలెక్టర్ తెలిపారు. పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ మున్సిపాలిటీలోని నండోలియా ఆర్గానిక్ కెమిక‌ల్స్‌ కంపెనీలో ఈ రోజు సాయంత్రం మంటలు చెలరేగాయి.

పాల్ఘర్ కలెక్టర్ కైలాస్ షిండే మాట్లాడుతూ పేలుడు సమయంలో 20 మంది ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు తెలిపారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించగా ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఒకరు మరణించగా మృతదేహం ఇంకా దొరకలేదని ఆయన తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ప్రస్తుతం ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ఆయన తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo